Samantha: వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే'(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.


అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య.. స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulupala)తో డేటింగ్‌లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు.

కానీ, సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటీస్(Myositis) అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా సమంత తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ స్టోరి పెట్టింది.

అందులో ‘ఇది 2025.. అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాంగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది స్టూడెంట్స్ మౌనంగా బాధపడుతున్నారు. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.

అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాను. నిజ నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటికి మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’ అని సమంత ఓ సెన్సేషనల్ నోట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా జనవరి 15న తోటి విద్యార్థుల వేధింపులు, అవమానకర చర్యలు తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులకు శిక్ష పడాలని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.