అక్కినేని నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. కారణాలేంటనేది వారికి, వారి కుటుంబ సభ్యులకే తెలియాలి. విడిపోయిన తర్వాత నాగచైతన్య ఈరోజు వరకు సమంత పేరు ఎత్తలేదు. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఎక్కడా సమంతను విమర్శించలేదు. శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. సమంత మాత్రం విడిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాగచైతన్యపై పడి ఏడుస్తుంటుంది. నిశితంగా ఆమెను గమనించేవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఎందుకు చేస్తుంది? అనేదానికి మాత్రం సమాధానం లేదు.
తనకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉంది తాజాగా మరోసారి పరోక్షంగా నాగచైతన్యపై పడి ఏడ్చింది. అక్కినేని లాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లి వెనక్కి తిరిగివచ్చిన సమంతకు ఆ తర్వాత ఆ కుటుంబం విలువ తెలిసినట్లుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన దృష్టిలో విజయం సాధించడం అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని చెప్పింది. నాగచైతన్య నుంచి విడిపోయి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఉందేమో, తనకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను విజయం సాధించానని ఎదుటివారు చెప్పేంతవరకు తాను ఎదురుచూడని, తనకు నచ్చినట్లగా జీవించడం అంటే మన అభిరుచికి తగినట్లుగా పనులు చేయడమే అన్నారు సమంత.
భార్యగా రాణించలేవు అలా కాకుండా స్త్రీలు ఒకేచోట బంధించి ఇది మాత్రమే చేయాలి, అది చేయకూడదు అంటూ నిబంధనలు విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. నిజ జీవితంలో ఎన్నోరకాల పాత్రలను మహిళ పోషిస్తుందన్నారు. అన్ని పాత్రల్లోను సమర్థవంతంగా రాణించడమే విజయం అని చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత రక్త్ బ్రహ్మాండ్ సీరియల్ లో నటిస్తుంది. ఒకచోట బంధించడం అంటే నిన్ను నాగచైతన్య ఏమైనా బంధించాడా? అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని వారు ఒకవేళ చెప్పివుంటే అదే సరైన విషయం అయివుంటుందని, వివాహానికి సంబంధించి భార్యగా నిజ జీవిత పాత్రలో నువ్వు రాణించడం అసాధ్యమని నెటిజన్లు తేల్చేస్తున్నారు.