టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు తెలియని వాళ్లు ఉండరు. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈమధ్య తెలుగులో ఒక్క సినిమా కూడా సమంత చేయలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే నాగచైతన్య ఇది వలె బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.. అప్పటినుంచి సమంతను కూడా ఆమె ఫ్యాన్సు రెండో పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సమంత నుండి ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి రియాక్షన్స్ రాలేదు కానీ, బాలీవుడ్ లో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో జీవితాంతం ఒంటరిగానే ఉంటారని అడగ్గా దానికి సమంత కచ్చితంగా కాదు అని సమాధానం చెప్పింది. అయితే ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా ఆమె సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందని మరో వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
సమంత పై రూమర్స్..
సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు బాగానే ఉన్న ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ అంగీకారంతోనే విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. అయితే నాగచైతన్య ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. సమంత మాత్రం రెండో పెళ్లి గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ సమంత కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు ఊపందుకు ఉన్నాయి. ఇటీవల ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో సమంత ప్రేమాయణం నడిపిస్తుందని మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి. తాజాగా సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ మరో వార్త నెట్ ఇంత దుమారం రేపు పోతుంది. అసలమే నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా? లేదా అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందా..?
సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. అయితే రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలలో సమంత చేతికి ఖరీదైన ఉంగరం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటోలను చూసిన నెటిజెన్లు నిజంగానే సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత కనీసం దీనిపైనా అయినా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే అనారోగ్యం నుండి పూర్తి స్థాయిలో కోలుకున్న సమంత ఇక నుండి ఫుల్ గా బిజీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఒక పక్క ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరో పక్క హీరోయిన్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి రెడీ అవుతుంది. తెలుగు, బాలీవుడ్ సినిమాలతో బిజీ అవ్వాలని సమంత ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. ఆ తర్వాత ఆమె రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.