ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌ బాటిల్‌తో సమంత .. ఆందోళనలో అభిమానులు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మనందరికీ సుపరిచితమే. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చివరగా ‘సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny) సిరీస్‌తో మనముందుకు వచ్చింది.


ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్'(Raktha Brahmand) మూవీతో పాటు తన సొంత నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం'(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. అలాగే తన నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్టు ‘శుభం'(Movie) మూవీ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే అందులో ఈ భామ హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన ఆమె అభిమానులు సమంతకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. కాగా సమంత నాగ చైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.