శామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ F17 5G వచ్చేసింది! అదిరిపోయే ఫీచర్లు.. అతి తక్కువ ధర

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ సెప్టెంబర్ 11న గెలాక్సీ F17 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంది. సో చాలా సన్నగా కనిపిస్తున్నా బలంగా కూడా ఉంటుంది.


పైగా ఇందులో AI సపోర్ట్‌ కూడా ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే గెలాక్సీ F17 5G 50 MP ప్రైమరీ కెమెరాతో OIS తో వస్తుంది. హై రిజల్యూషన్, బ్లర్-ఫ్రీ ఇమేజెస్ దీని ప్రత్యేకత. ఇది రెండు రకాల లెన్స్‌లు మాక్రో, అల్ట్రా-వైడ్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం గెలాక్సీ F17 5G 13MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

గూగుల్ నుండి సర్కిల్ టు సెర్చ్ తో పాటు , గెలాక్సీ F17 5G జెమిని లైవ్ ను కూడా కలిగి ఉంది. గెలాక్సీ F17 5G డిస్ప్లే ఫుల్ HD+ సూపర్ AMOLED. 5nm-ఆధారిత Exynos 1330 CPUతో వస్తుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇది బెస్ట్‌ ఫీచర్‌ అని చెప్పొచ్చు. అంతేకాకుండా గెలాక్సీ F17 5G IP54 సర్టిఫికేషన్ దుమ్ము, నీటి తుంపరల నుండి రక్షిస్తుంది. సెప్టెంబర్ 11 నుండి Samsung Galaxy F17 5G రిటైల్ స్టోర్స్‌లో, శామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఇక దీని ధర విషయానికి వస్తే అతి తక్కువ ప్రైజ్‌లో సూపర్‌ ఫీచర్లతో వస్తుందని చెప్పాలి. 4GB+128GB మోడల్ ధర రూ.13,999, 6GB+128GB మోడల్ ధర రూ.15,499, 8GB+128GB మోడల్ ధర కేవలం రూ.16,999. ఈ రేంజ్‌ ప్రైజ్‌లో ఇన్ని ఫీచర్లు అంటే బెస్ట్‌ అని చెప్పొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.