శామ్సంగ్ అత్యంత శక్తివంతమైన స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా పేరుతో ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన అన్ ప్యాక్డ్ ఈవెంట్-2024లో ఆవిష్కరించింది.
ఇది శామ్సంగ్ నుంచి వస్తున్న రిచ్ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ వాచ్ గా చెబుతున్నారు. అలాగే బిల్ట్ క్వాలిటీ కూడా చాలా అధికంగా ఉంటుందని, టైటానియం గ్రేడ్ 4 ఫ్రేమ్ తో వస్తుందని వివరిస్తున్నారు. అంతేకా ఇది ఎంఐఎల్-ఎస్టీడీ-810 రేటెడ్ 10ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ తో కలిసి వస్తుందని శామ్సంగ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా..
గేలాక్సీ వాచ్ అల్ట్రా జూలై 10 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. జూలై 24 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీని ధర 649డాలర్లు ఉంటుంది. మన కరెన్సీలో రూ. 54,000కు పైగానే ఉంటుంది.
శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా ఫీచర్స్..
ఈ వాచ్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. డైనమిక్ లగ్ సిస్టమ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది మల్టీ స్పోర్ట్స్ టైల్ ట్రాక్స్ ట్రైత్లాన్ వర్క్ అవుట్ల కోసం సరిగ్గా సరిపోతుంది. దీనిలో ఏఐ ఆధారిత ఫీచర్లు ఉంటాయి. అలాగే దీనిలో పర్సనలైజ్ హెచ్ఆర్ జోన్ ద్వారా యూజర్ల వర్క్ అవుట్లను పర్యవేక్షించవచ్చు. అలాగే ఇన్ స్టంట్ ఇనిషియేషన్ కోసం కొత్తగా క్విక్ బటన్ వస్తోంది. దీని సాయంతో వర్క్ అవుట్ సమయానికి ఎమర్జెన్సీ సైరన్ వస్తుంది.
దీనిలో డిస్ ప్లే 1.5 అంగుళాల సూపర్ అమోల్డ్ ఆల్ వేస్ ఆన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది పగటి పూట కూడా క్లియర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 590ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్లో అదనంగా 48 గంటల పాటు బ్యాటరీ వస్తుంది. దీనిలో డయల్ 47ఎంఎం ఉంటుంది. టైటానియం గ్రే, టైటానియం వైట్, టైటానియం సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది వేర్ ఓఎస్ 5 ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎక్సినోస్ డబ్ల్యూ1000 చిప్ ఆధారంగా రన్ అవుతుంది.
దీనిలో బాడీ కంపోజిషన్ టూల్, స్లీప్ అనాలిసిస్, ఎఫ్డీఏ అథరైజ్డ్ స్లీప్ అప్నీయా ట్రాకింగ్, రియల్ టైం హార్ట్ రేట్ మోనిటరింగ్, హార్ట్ సరిగా లేకపోతే గుర్తించడానికి ఐహెచ్ఆర్ఎన్, ఈసీజీ, బీపీ మోనిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది యాపిల్ వాచ్ అల్ట్రాకు పోటీగా శామ్సంగ్ దీనిని తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.