అధిక బరువు కారణంగా ఆరోగ్యానికి చాలా నష్టం. ఎన్నో సమస్యలొస్తాయి. దీనిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాల దగ్గర్నుంచి జిమ్ వర్కౌట్స్ దాకా చాలా ప్రయత్నిస్తారు కొంతమంది. అలాంటివారు ఫుడ్‌లో కూడా కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పుడ్స్‌ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు సపోటా తింటే బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం.
ఈ పండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తినాలనే కోరికలు తగ్గుతాయి. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. కేలరీలు ఎలాగూ తక్కువగా తీసుకుంటాం. కాబట్టి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
తక్కువ కేలరీలు..
ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువ కేలరీలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో కేలరీలు చాలా తక్కువ. దీంతో కేలరీల గురించి ఆలోచించకుండా వీటిని హ్యాపీగా తినొచ్చు. దీంతో బరువు తగ్గుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలు..
సపోటల్లోని చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపించదు. అంతే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో పాటు, ఇందులోని విటమిన్స్, ఖనిజాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి హెల్ప్ అవుతాయి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
జీర్ణవ్యవస్థ..
సపోటల్లో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థని హెల్దీగా ఉంచుతాయి. కడుపులో మంట రాకుండా చూస్తాయి. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యం బాగుంటుంది.
పోషకాలు..
బరువు తగ్గాలనుకునేవారు డైట్ ఫాలో అయ్యేటప్పుడు విటమిన్స్, మినరల్స్ లోపం రాకుండా పోషకాహారం తీసుకోవాలి.
కాబట్టి, విటమిన్, ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఈ పండ్లు తింటే జీవక్రియ పెరిగి కొవ్వు కరిగి బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.