Saturday Pooja: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. అందులోను శనివారం వస్తుందంటే చాలు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు.
శనివారం నాడు స్వామిని పూజించడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి వారిని ఆపద మొక్కుల వాడు అని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడని అంటారు. జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు వచ్చినా కూడా తీరుస్తాడని నమ్మకంతో పూజిస్తుంటారు. అంతే కాదు శనివారం నాడు పూజించే శనిదేవుడి కోపం కూడా భక్తులపై పడకుండా కాపాడతాడు.
శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే దోషాలు, పాపాలు తొలగిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన కృప, పొందాలన్నా, శనిదోషం పోవాలన్నా కూడా స్వామి వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. 8 శనివారాల పాటు ఖచ్చితంగా ఓ వ్రతం చేయాల్సి ఉంటుంది.
మగవారు వరుసగా 8 వారాల పాటు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్రతాన్ని ఆడవారు చేయాలని అనుకుంటే మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఒకవేళ అడ్డంకులు వచ్చినా ఆ వారం మినహా మిగతా వారాల పాటు వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ తరుణంలో వ్రతం పాటించే సమయంలో శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకుని పూజ ప్రారంభించాలి. ఈ క్రమంలో బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి, చిన్న బెల్లం ముక్క, అరటిపండు ముక్క వేసి కలిపి దానిని ప్రమిదలుగా చేసి అందులో దీపం వెలిగించాలి. ఈ ప్రమిదలో 7 వత్తులు వేసి స్వామిని పూజించాలి. ఇలా 8 శనివారాల పాటు పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.