సేవింగ్ అకౌంట్‌లో ఇంతకంటే ఎక్కువ జమ చేస్తున్నారా?.. లిమిట్ దాటితే ఏమవుతుందంటే

www.mannamweb.com


ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, వ్యాపారం ప్రారంభించేందుకు లోన్ కావాలన్నా బ్యాంకుల్లో అకౌంట్ ఉండాల్సిందే. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు కూడా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. బ్యాంకులు తమ కస్టమర్లకు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ వంటివి అవసరానికి తగ్గట్టుగా ఇస్తుంటాయి. ఉద్యోగులు శాలరీ అకౌంట్ తెరుస్తుంటారు. అయితే ఎక్కువ మంది సేవింగ్ ఖాతాలనే కలిగి ఉంటారు. సంపాదించిన డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటుంటారు ఖాతాదారులు. సేవింగ్ అకౌంట్లలో డబ్బును సురక్షితంగా భద్రపరుచుకోవడమే కాకుండా దానిపై వడ్డీ కూడా పొందొచ్చు.

ఒక్కోసారి ఇతరుల డబ్బులను కూడా తమ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సేవింగ్స్ ఖాతా లిమిట్ దాటుతుంది. అసలు సేవింగ్ ఖాతాలో లిమిట్ ఎంత? పొదుపు ఖాతాలో ఎంత డబ్బును జమ చేసుకోవచ్చు? లిమిట్ దాటితే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఆ వివరాలు చూసినట్లైతే.. సేవింగ్ ఖాతాలో లిమిట్ దాటితే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిసులు వస్తాయి. మరి ఇలా కాకూడదు అంటే సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం. సేవింగ్స్ ఖాతాలో ఎన్ని డబ్బులైనా జమ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి లిమిట్ లేదు. కానీ, ఆదాయపు పన్ను శాఖ.. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల డబ్బులపై రూ. 10 లక్షల పరిమితి విధించింది.

అంటె ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. 10 లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. పరిమితికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. పరిమితికి మించి సేవింగ్ చేస్తే అది ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 285బీఏ ఈ నిబంధనలు సూచిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో సరిపోలకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

అప్పుడు ఖాతాదారులు ఆ ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ముందే తెలుసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీ పొదుపు ఖాతాలోని సొమ్ములపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి జమ అవుతుంది. వడ్డీపై పన్ను కట్టాలి. బ్యాంకు ఇచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంక్ ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీ రూ.10 వేల కంటే తక్కువుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.