ఎస్‌బీఐ 25 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు, వివరాలివీ

www.mannamweb.com


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 25.

పోస్టుల వివరాలు: హెడ్‌(ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్‌)–01, జోనల్‌ హెడ్‌–04, రీజనల్‌ హెడ్‌–10, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌–09, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌(ప్రొడక్ట్‌ లీడ్‌)–01.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: 01.08.2024 నాటికి రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌ పోస్టుకు 28 నుంచి 42 ఏళ్లు, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్‌ లిస్ట్, అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పనిచేయాల్సిన ప్రదేశాలు: ముంబై, చెన్నై, కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.12.2024

వెబ్‌సైట్‌: http://https//sbi.co.in