ఎస్‌బీఐ బెస్ట్‌ హోమ్‌ లోన్‌ ఆఫర్లు.. రూ.60 లక్షలకు వడ్డీ, EMI ఎంతంటే

www.mannamweb.com


దేశంలోని పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకులు కస్టమర్లకు చాలా రకాల లోన్లు ఆఫర్‌ చేస్తున్నాయి. ఫ్లెక్సిబుల్‌ రీపేమెంట్‌ ఆప్షన్లు, తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
బ్యాంక్‌ లోన్‌ ప్రయోజనాలపై అవగాహన పెరగడంతో చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు హోమ్‌ లోన్‌ పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కస్టమర్లకు అతి తక్కువ వడ్డీతో హోమ్ లోన్లు అందిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రేట్లు 8.50% నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు లోన్ టెన్యూర్‌ను 30 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. అంటే రీపేమెంట్ టైమ్ పరంగా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, లోన్ మొత్తంలో 0.35% (మినిమం రూ.2,000; మ్యాగ్జిమం రూ.10,000) (ప్లస్ ట్యాక్స్‌) ఉంటుంది. మహిళా రుణగ్రహీతలకు SBI గృహ రుణాలపై 0.05% వడ్డీ రాయితీ కూడా అందిస్తోంది. ప్రాపర్టీ విలువలో 90 శాతం వరకు హోమ్ లోన్ రూపంలో పొందవచ్చు.

అదనంగా ఎస్‌బీఐ టాప్-అప్ హోమ్ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. హోమ్‌ లోన్‌ తీసుకున్న తర్వాత కూడా, కొన్ని నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో టాప్-అప్ లోన్ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. అయితే సాధారణ హోమ్‌ లోన్‌తో పోలిస్తే టాప్-అప్ లోన్‌లు అధిక వడ్డీ రేటుతో వస్తాయని గమనించడం ముఖ్యం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఎస్‌బీఐ టాప్-అప్ హోమ్ లోన్‌లకు 8.80 శాతం నుంచి 11.30 శాతం మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తుంది.

* రూ.60 లక్షల హోమ్ లోన్‌ తీసుకుంటే ఈఎంఐ ఎంత చెల్లించాలి?
ఒక కస్టమర్ 30 సంవత్సరాల పాటు 8.50 శాతం వడ్డీ రేటుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.60 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. వారు నెలవారీ రూ.46,135 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఈ వ్యవధిలో మొత్తం వడ్డీతో కలిసి రూ.1 కోటి 66 లక్షల 8 వేల 600 తిరిగి చెల్లిస్తారు. కేవలం వడ్డీనే రూ.1 కోటి 6 లక్షల 8 వేల 600 అవుతుంది. లోన్‌ టెన్యూర్‌ తక్కువగా ఉంటే, వడ్డీ మొత్తం తగ్గుతుంది.

ఒకవేళ 25 ఏళ్ల టెన్యూర్‌ ఎంచుకుంటే, అదే రూ.60 లక్షలు, 8.50 శాతం వడ్డీకి మొత్తం రూ.1,44,94,088 చెల్లిస్తారు. ఇందులో కేవలం వడ్డీ రూ.84,94,088 అవుతుంది. 30 ఏళ్ల టెన్యూర్‌తో పోలిస్తే ఇందులో వడ్డీ చాలా తగ్గుతుంది. ప్రతినెలా చెల్లించే ఈఎంఐ భారం రూ.48,314కి పెరుగుతుంది.

మీరు 20 ఏళ్లలోనే హోమ్‌ లోన్‌ తీర్చేయాలని నిర్ణయించుకుంటే, వడ్డీ చాలా తగ్గుతుంది. రూ.60 లక్షల ప్రిన్సిపల్‌ అమౌంట్‌కి 8.50 శాతం వడ్డీ చొప్పున రూ. 1,24,96,655 తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో మీరు చెల్లిస్తున్న వడ్డీ రూ.64,96,655 మాత్రమే. అయితే ఈఎంఐ నెలకు రూ.52,069 అవుతుంది.