SBI JanNivesh SIP: సాధారణంగా బ్యాంకులు పొదుపు ఖాతాలను ప్రోత్సహిస్తుంటాయి. అలాగే తమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టమని కూడా ప్రోత్సహిస్తుంటాయి.
కానీ ఈ మధ్యకాలంలో పలు బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ కూడా నిర్వహిస్తున్నాయి. పొదుపుతో పాటు మదుపు చేసుకోండి అంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. పొదుపు చేస్తే వడ్డీ మాత్రమే లభిస్తుంది. మదుపు చేస్తే పెద్ద మొత్తంలో భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెద్ద మొత్తంలో మార్కెట్లో పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ లో సామాన్యులు సైతం పెట్టుబడి పెట్టేలా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చి SBI JanNivesh SIP అనే స్కీం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రతినెల 250 రూపాయలు మినిమం SIP రూపంలో మదుపు చేయవచ్చు. ఈ స్కీం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
SBI మ్యూచువల్ ఫండ్స్ సరికొత్త SBI JanNivesh SIP ని ప్రారంభించింది. SBI మ్యూచువల్ ఫండ్, భారతీయ స్టేట్ బ్యాంక్ సహకారంతో, SEBI చైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సమక్షంలో SBI JanNivesh SIPని ప్రారంభించారు. ఈ స్కీంను SBI మ్యూచువల్ ఫండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో ప్రారంభించారు.
SBI JanNivesh SIP మెయిన్ ఫీచర్స్ ఇవే..
– ఇందులో కనీస పెట్టుబడి రూ.250 నుండి ప్రారంభం అవుతోంది.
– ఇందులో రోజు, వారం, నెలవారీ రూపంలో మదుపు చేయవచ్చు.
– డిజిటల్ SBI YONO ప్లాట్ఫారమ్ ద్వారా ఈ స్కీంలో మదుపు చేయవచ్చు.
– అలాగే Paytm, Groww, Zerodha వంటి ఫిన్ టెక్ ప్లాట్ ఫారంలు ఉపయోగించి కూడా మదుపు చేయవచ్చు.
SBI JanNivesh SIP స్కీం ద్వారా మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత డబ్బు పొందవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకు ప్రతినెల 250 రూపాయలు 20 సంవత్సరాలు మదుపు చేసినట్లయితే, 16 శాతం రిటర్న్ వస్తుందని భావిస్తే మీరు పెట్టిన పెట్టుబడి రూ.60,000 అవుతుంది. అప్పుడు రూ. 3,77,365 మీ పెట్టుబడిపై రిటర్న్ లభిస్తుంది. అలాగే పెట్టుబడితో రిటర్న్ కలిపినట్లయితే 20 సంవత్సరాల్లో మీ పెట్టుబడి 4,37,365 రూపాయలు అవుతుంది. అలాగే నెలకు 7500 రూపాయలు( రోజుకు రూ.250) చొప్పున మీరు మదుపు చేసినట్లయితే 20 సంవత్సరాల మీ పెట్టుబడి 98,72,597 రూపాయలు అవుతుంది. అంటే మీరు కోటీశ్వరులు అవుతారు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి 18,00,000 రూపాయలు కాగా 80,72,597 రూపాయలు మీకు లభించిన రిటర్న్ గా భావించవచ్చు. అయితే ఇది పూర్తిగా సాలీనా 14 శాతం రిటర్న్ పొందినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.