తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి. అశోక్ బాబు, తిరుమల్ నాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29 నాటికి ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగియనున్న వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. ఈ సందర్భంలో, ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది: మార్చి 10
నామినేషన్ల పరిశీలన: మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13
పోలింగ్: మార్చి 20 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5)