బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ స్క్రీనింగ్.. షార్క్ సీన్ చూసి నోరెళ్లబెట్టిన విదేశీయులు

www.mannamweb.com


ప్రస్తుతం దేవర కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ రేపు (సెప్టెంబర్ 27న) థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు తారక్. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలాగే అటు విదేశాల్లోనూ తారక్ సందడి చేస్తున్నారు. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అక్కడి స్టేజ్ పై తారక్ మాట్లాడుతూ దేవర ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే బియాండ్ ఫెస్ట్ లో దేవర టీజర్, ట్రైలర్ ప్రదర్శించారు. అయితే అక్కడ దేవర ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు హాలీవుడ్ అడియన్స్.

ముఖ్యంగా ఈ లోని షార్క్ సీన్ చూసి నోరెళ్లాబెట్టారు. ట్రైలర్ అయ్యాక అందరూ లేచి నిల్చొని చప్పట్లతో మారుమోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ట్రైలర్ చూసి అటు విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. ఇక చూస్తే ఏమైపోతారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈరోజు సాయంత్రం బియాండ్ ఫెస్ట్ లో దేవర ప్రీమియం వేయనున్నారు. అటు తారక్ కూడా ఇదే ఫెస్ట్ లో ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంచనాలు పెంచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే సమయంలో గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయానని.. ఇదొక అద్భుతమైన యాక్షన్ డ్రామా అని అన్నారు. ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని కలిగించాలనే 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశామని.. దేవర చూస్తున్నప్పుడు అవెంజర్స్, బ్యా్ట్ మ్యాన్ మూవీస్ వంటి హాలీవుడ్ చిత్రాలను చూసిన అనుభూతి కలుగుతుందని అన్నారు. దీంతో ఇప్పుడు దేవర చిత్రంపై మరింత హైప్ పెరిగింది.