మీరు BSNL ని సెకండ్ సిమ్‌గా వాడుతున్నారా?

BSNL ఇటీవల కాలంలో క్రమంగా యూజర్ల సంఖ్యను పెంచుకుంటోంది. గత సంవత్సరం జులైలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్‌ టారిఫ్‌ ఛార్జీలను భారీగా పెంచడంతో BSNL కు లక్షల మంది యూజర్లు క్యూ కట్టారు.


దీంతోపాటు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ క్రమంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వీలుగా లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు ఈ సంవత్సరం జూన్‌లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.

BSNL రెండో సిమ్‌ కార్డుగా : ఇతర సంస్థలతో పోలిస్తే BSNL తక్కువ ధరలో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఇటీవల మరియు మెరుగైన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మంది యూజర్లు BSNL ను రెండో సిమ్‌ కార్డుగా వినియోగిస్తున్నారు.

సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ప్రతి నెలా రీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి టారిఫ్‌ల భారం ఎక్కువ కాకుండా ఉండేలా BSNL అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.107 రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా (BSNL RS107 Recharge Plan) సుమారు 35 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 200 నిమిషాల పాటు కాలింగ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా ఎటువంటి SMS లను అందించడం లేదు. సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది.

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రీఛార్జ్‌ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.397 రీఛార్జ్‌ ప్లాన్‌ (BSNL RS397 Recharge Plan)ద్వారా ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో కొన్ని రోజులపాటు కాలింగ్‌, డేటా, SMS లను పొందవచ్చు. సుమారు 5 నెలలపాటు చాలా తక్కువ ధరతో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. తొలి 30 రోజుల వరకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం పొందవచ్చు. అదే డేటా పరంగా ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల తీసుకొచ్చింది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్నవారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. రూ.439 ప్లాన్‌లో (BSNL RS439 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా మొత్తంగా 300 SMS లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. కేవలం కాలింగ్ కోసం తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ కావాలనుకొనే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మూడు నెలలపాటు కాలింగ్‌, SMS లను పొందవచ్చు. BSNL ను రెండో సిమ్‌ కార్డుగా ఉపయోగిస్తున్నవారు, కేవలం కాలింగ్‌ కోసమే ఫోన్‌ వినియోగిస్తున్న వారికి రూ.439 రీఛార్జ్ అనుకూలంగా ఉంటుంది.