కొత్త ప్రాంతాలను చుట్టేయడం.. వెకేషన్స్ ఎంజాయ్ చేయడం.. మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. కానీ ఇక్కడ అసలైన సవాల్.. హోటల్ గదుల్లో కెమెరాలు పెట్టి చిత్రీకరించడం.
ఇవి ప్రైవసీ, సెక్యూరిటీ లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి కేసులు పెరుగుతుండగా.. ఇలాంటి హిడెన్ కెమెరాస్ గుర్తించేందుకు మార్కెట్‌లోకి స్పెషల్ గాడ్జెట్స్ వచ్చాయి. అయితే ఎప్పుడూ మనవెంటే ఉండే మొబైల్‌తో కూడా రూమ్‌లో దాచిపెట్టిన కెమెరాలను గుర్తించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం ఏం చేయాలి? మన ప్రైవసీని ఎలా రక్షించుకోవాలి? చూద్దాం.
* ముందుగా గదిలో లైట్లు స్విచాఫ్ చేయండి. ఎయిర్ వెంట్స్, స్మోక్ డిటెక్టర్స్, అలారం గడియారాలు, అద్దాలు వంటి ప్రదేశాల్లోనే కెమెరాలు పెట్టే చాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేయండి.
* ఎందుకంటే కెమెరాను ఎంత రహస్యంగా దాచినా.. వాటిలో కాంతిని ప్రతిబింబించే లెన్స్‌లు ఉంటాయి.
* మొబైల్ ఫ్లాష్ లైట్‌కు ఇలాంటి చిన్న మెరుపు లాంటిది కనిపించిందో.. అనుమానాస్పదంగా ఉందో.. ఆ ప్రాంతాన్ని మరింత దగ్గరగా పరిశీలించండి.
* ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఆన్ చేసి.. మీకు అనుమానంగా ఉన్న ప్రాంతాలలో కెమెరాను నెమ్మదిగా ప్యాన్ చేయండి.
* కెమెరా స్క్రీన్‌పై చిన్న, పల్సింగ్ చుక్కలు లేదా గ్లోలు కనిపిస్తే.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించండి. మీకు కెమెరా దొరికిపోవచ్చు.
* లేదంటే అప్పుడు కెమెరా-డిటెక్షన్ యాప్‌లను ఉపయోగించండి.
* ఆండ్రాయిడ్, iOS పరికరాలకు అందుబాటులో ఉన్న వివిధ యాప్‌లు దాచిన కెమెరాలను గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి. ఈ యాప్‌లు ఫోన్ కెమెరా, సెన్సార్‌లను ఉపయోగిస్తాయి. ఇన్‌ఫ్రారెడ్ లైట్లు, అయస్కాంత క్షేత్రాలు, అసాధారణ సంకేతాలతో దాచిన కెమెరాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ యాప్‌లలో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి, సూచనలను అనుసరించండి. అనుమానాస్పద వస్తువులు లేదా ప్రాంతాలను పరిశీలించడానికి దాన్ని ఉపయోగించండి.
* అనుమానాస్పద పరికరాల కోసం Wi-Fi నెట్‌వర్క్ చెక్ చేయండి. రికార్డ్ అయిన ఫుటేజ్‌ను ప్రసారం చేయడానికి హిడెన్ వైర్‌లెస్ కెమెరాలు Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవుతాయి. కాబట్టి హోటల్ Wi-Fi నెట్‌వర్క్‌ను స్కాన్ చేయడం ద్వారా.. తెలియని పరికరాలను గుర్తించవచ్చు. మీ ఫోన్ Wi-Fi సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనెక్ట్ చేయబడిన డివైజ్‌లను చూండి. నంబర్స్, సైన్స్, IP కెమెరా, కెమెరా వంటి సాధారణ లేబుల్‌లతో ప్రారంభమయ్యే పరికరాల పేర్లు ఉంటే హోటల్ యాజమాన్యానికి ఇన్ఫర్మ్ చేయండి. గదిలో కనెక్ట్ చేయబడిన పరికరాలను స్కాన్ చేయడానికి మీరు బ్లూటూత్‌ను ఉపయోగించవచ్చు.