సచివాలయంలో ఓ మంత్రి అకస్మాత్తుగా ఉలిక్కి పడ్డారు.. అధికారులతో సమీక్ష చేస్తుంటే పై నుంచి వచ్చిన సౌండ్లతో ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. మంత్రే కాదు అక్కడున్న అధికారులు సైతం ఏమైందన్న భయంతో దిక్కులు చూసారట..!
ఆ తర్వాత అసలు విషయం తెలుసుకోని కూల్ అయ్యారట.. అసలేం జరిగిందో తెలుసుకోండి.. సచివాలయంలో సమీక్ష చేస్తున్న ఆర్ అండ్ బీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కి వింత అనుభవం ఏదురైంది.. అధికారులతో 5వ ప్లోర్ లో సమీక్ష చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైన ఏసీ లో నుంచి శబ్దాలు వచ్చాయి.. దీంతో మంత్రితోపాటు అధికారులు ఉలిక్కి పడ్డారట.. ఎమైందా అని ఆరా తీస్తే ఏసీలో ఉన్న సమస్యతో అలా సౌండ్స్ వస్తున్నాయని అధికారులు చెప్పారట.. ఇక అప్పటికే అధికారుల తీరు పై అసంతృప్తి తో ఉన్న మంత్రి సచివాలయంలోని తన ఛాంబర్ , సచివాలయ నిర్మాణం లోపాలపై అధికారులకు క్లాస్ తీసుకున్నారట.. ఆర్ అండ్ బి శాఖ మంత్రి ఛాంబర్ లో చాలా చోట్ల పగుళ్లు, ఎసీలో నుంచి వాటర్ లీకేజీ, వాష్ రూమ్స్ లో గ్లాస్‌లు పగిలి ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసారట మంత్రి..
ఈ క్రమంలో మంత్రి.. సెక్రెటేరియట్ లోని తన చెయిర్ క్రింద టైల్స్ ఫిటింగ్ నిర్లక్ష్యాన్ని అధికారులకు స్వయంగా చూపించారు.. వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టినామని చెప్పిన రాష్ట్ర సచివాలయంలో మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని.. టైల్స్ మధ్యనున్న గ్యాప్స్ ను చూపించారట మంత్రి.. మనం ఖర్చుపెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని.. దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారని తెలుస్తోంది.. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూసీచూడనట్లు వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారట.. ప్రతీది నాణ్యంగా ఉండాలి, ప్రతీ పని ప్రజలు మెచ్చుకునేలా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారట..
తర్వాత మిగితా మంత్రులు అధికారుల, ఛాంబర్లు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఒక్కసారిగా ఏదురైన ఈ సంఘటనతో అవాక్కయిన మంత్రి అసలు సమస్యకు చెక్ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు..