ఈ రోజుల్లో ఎంతో మంది హీరోహీరోయిన్లు సినిమాలతోనే గాక పలు వ్యాపారాలు చేస్తూ బోలెడంత సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ సంపాదన వివరాలు చూద్దాం..
ఈ రోజుల్లో ఎంతో మంది హీరోహీరోయిన్లు సినిమాలతోనే గాక పలు వ్యాపారాలు చేస్తూ బోలెడంత సంపాదిస్తున్నారు. ఇందుకు తాను మినహాయింపు కాదంటూ ఓ సీనియర్ హీరోయిన్ ఫుల్లుగా వ్యాపారాలు చేసేస్తోంది. ఆమె ఎవరో కాదు బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన రమ్యకృష్ణ.
80-90 దశకాల్లో తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతూ కుర్రకారును హీటెక్కిచింది గ్లామర్ బ్యూటీ, హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ జతకట్టి, మస్త్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. రోల్ ఎలాంటిదైనా అందులో లీనమై రాణించడం రమ్యకృష్ణ స్టైల్.
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ, సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’లో శివగామిగా ఆమె నటన అద్భుతం. ఈ రోల్ ఆమె కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఆశ్చర్యపరిచిన ఆమె, అప్పటి నుంచి ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా, రమ్యకృష్ణ సంపాదన మాత్రం భారీగానే ఉందట. ఒక సంవత్సరానికి కేవలం ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే కనిపించే రమ్యకృష్ణ, నెలకు సుమారు 5 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్థాయిలో సంపాదన రావడానికి ఆమె సినిమాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తోందట. ఆమెకు కేరళలో ఆమెకు ఐదు బ్యూటీ పార్లర్లు, హైదరాబాద్‌లో మూడు జ్యూవెలరీ షాపులు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు యాడ్స్, సినిమాలు, ఇతర వ్యాపారాలతో కోట్లలో సంపాదన చేస్తోందట ఈ సీనియర్ హీరోయిన్.
స్టార్ హీరోలతో పోల్చితేనే ఈమె ఆదాయం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నది మాత్రమే. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రమ్యకృష్ణ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కొడుకు ఉన్నారు.
































