కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.
ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA), ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
PAN 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
PAN 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్.
ఇది CCEA ప్రకారం.. కోర్, నాన్-కోర్ PAN/TAN కార్యకలాపాలతో పాటు PAN ధ్రువీకరణ సేవను ఏకీకృతం చేసే ప్రస్తుత PAN/TAN 1.0 ఎకో-సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వంటి బహుళ ప్రయోజనాలతో పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల సాంకేతిక పరివర్తనను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది.
క్యాబినెట్ సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశంలో 78 కోట్ల పాన్ కార్డ్‌లను ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ అన్ని వ్యాపార సంబంధిత కార్యకలాపాల కోసం ఒక సాధారణ వ్యాపార గుర్తింపుదారుని, అన్ని కార్యకలాపాల కోసం ఏకీకృత పోర్టల్‌ను కూడా కలిగి ఉంటుంది.
దీంతో పాటుగా కేంద్ర కేబినెట్ మరికొన్నింటికి ఆమోదం తెలిపింది. రూ.2750 కోట్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, రూ.2481 కోట్లతో ‘ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్’, రూ.3,689 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశంలోని విద్యార్థుల కోసం వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం ప్రవేశపెట్టనున్న కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కోసం రూ.6,000 కోట్లను కేటాయించనున్నట్లు కేబినెట్ తెలిపింది. దీనిలో భాగంగా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉండనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.