సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన Honda Activa! జనాలు ఎందుకు దీన్ని ఎగబడి కొంటున్నారు?

www.mannamweb.com


హోండా యాక్టివా స్కూటర్ దేశంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ స్కూటర్ ఏకంగా రెండు దశాబ్దాల నుంచి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో సర్రున దూసుకుపోతుంది. సేల్స్ లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికీ సేల్స్‌లో ఈ స్కూటర్ నెంబర్ వన్‌గా కొనసాగుతుందంటే దీని క్రేజ్ ఏంటో రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇదింతలా ఫేమస్ అవ్వడానికి కారణం దీని ఫీచర్లు. ఇంకా దీని రైడింగ్ కంఫర్ట్, అందరిని ఆకట్టుకునేల డిజైన్ చెయ్యడంతో జనాలు హోండా యాక్టివాకి బ్రహ్మ రథం పడుతున్నారు. పైగా మన నిత్యవసరాల నుంచి భారీ పేలోడ్ పవర్ ఉన్న పనుల వరకు హోండా యాక్టివా అదిరిపోయే పర్ఫామెన్స్ అందిస్తుంది. దీంతో జనాలు ఈ స్కూటర్ ని ఎగబడుడి కొంటున్నారు.

తాజాగా ఈ స్కూటర్ ఓ రికార్డుని సృష్టించింది. సౌత్ ఇండియా స్టేట్స్ అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి ఇంకా అండమాన్ & నికోబర్లో ఈ స్కూటర్ మొత్తం 10 మిలియన్ (1 కోటి) యూనిట్ల అమ్మకాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.హోండా కంపెనీ అందించే సర్వీస్‌ వల్ల కూడా ఈ స్కూటర్ యమా పాపులర్ అయ్యింది. ప్రతి నెల ఈ స్కూటర్ తన అద్భుతమైన సేల్స్ తో హోండా కంపెనీకి లాభాల వర్షాన్ని కురిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూటర్ కచ్చితంగా మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో కంపెనీ ఉంది. ఇక దీని ప్రారంభ ధర విషయానికి వస్తే.. రూ. 78,285(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక ఖరీదైన వేరియంట్ ధర రూ.84,285(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈ స్కూటర్లో స్మార్ట్ కీ, స్మార్ట్ సేఫ్ (యాంటీ థెఫ్ట్ ఫంక్షన్) ఫీచర్లు ఉన్నాయి. ఇంకా స్కూటర్‌ను ఈజీగా గుర్తించే ఫీచర్, బయట ఫ్యూయల్ క్యాప్, అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 109.51 సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. దీని పవర్ విషయానికి వస్తే.. పవర్ యూనిట్ 7బీహెచ్‌పీ శక్తిని, 8.90ఎన్‌ఎం మాక్సిమం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో 3 స్టేజస్ అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్‌ ఉంటుంది.