ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. సరిగ్గా గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. జూన్ 12న ప్రభుత్వం కొలువుదీరింది.
అయితే ఈ తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలపై భారీగా అసంతృప్తి పెరిగినట్లు ఓ సర్వే తేల్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సగానికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని సదరు సర్వే సంస్థ తేల్చి చెప్పింది. దీంతో ఇది కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారింది. గతంలో ఈ సర్వే సంస్థ చాలా సార్లు తమ సర్వే నివేదికలను వెల్లడించింది. అది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సదరు సర్వే సంస్థ ఐఐటీ నిపుణులతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. అయితే నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల్లో 71 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అది 70 శాతానికి దాటడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో కూటమి( Alliance) తరుపున 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21 మంది, బిజెపి నుంచి ఎనిమిది మంది గెలిచారు. అయితే గెలిచిన వెంటనే కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలు నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. చాలాసార్లు ఎన్డీఏ పక్ష సమావేశాలు నిర్వహించి ఇదే మాట చెబుతున్నారు సీఎం చంద్రబాబు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పెడచెవిన పెడుతున్నట్లు తాజా సర్వే ద్వారా తేలింది. ప్రధానంగా మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ప్రజాప్రతినిధులు మారిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. సర్వేలో కూడా వీటిపైనే ఎక్కువగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యేలు. కొంతమంది మంత్రులు నేరుగా రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా అవతారం ఎత్తినట్లు ఈ సర్వే సంస్థ గుర్తించినట్లు సమాచారం.
అయితే ఈ సర్వేలో 71 మంది.. 70 శాతానికి పైగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందులో శ్రీకాకుళం( Srikakulam) జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం నియోజకవర్గం ఉన్నాయి.
* విజయనగరం ( Vijayanagaram) జిల్లాకు సంబంధించి గజపతినగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు ఉన్నాయి.
* విశాఖ( Visakha ) జిల్లాకు సంబంధించి ఎలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
* తూర్పుగోదావరి కి ( East Godavari) సంబంధించి తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం
* పశ్చిమగోదావరి కి ( West Godavari) సంబంధించి తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి
* కృష్ణా( Krishna) జిల్లాకు సంబంధించి విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ
* గుంటూరు( Guntur ) జిల్లాకు సంబంధించి పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల
* ప్రకాశం ( Prakasam )జిల్లా కు సంబంధించి కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు
* నెల్లూరు ( Nellore ) జిల్లాకు సంబంధించి కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి
* కడప ( Kadapa)జిల్లాకు సంబంధించి రాయచోటి, కోడూరు
* కర్నూలు( Kurnool ) జిల్లాలో పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూలు, డోన్, నందికొట్కూరు
* అనంతపురం( Ananthapuram ) జిల్లాకు సంబంధించి మడకశిర, పెనుగొండ, కదిరి, గుంతకల్, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం.
* చిత్తూరు ( Chittoor) జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి, తిరుపతి,చంద్రగిరి,నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు.