Hyderabad: వరుసగా ఢీకొన్న ఏడు కార్లు

రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి.


అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం(అక్టోబర్‌ రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వస్తుండగా జరిగింది.

ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ​

ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.