Harsha Vardan : ఆమెతో ఏడేళ్ల లవ్.. అందుకే బ్యాచిలర్ గా ఉండిపోయా

సీనియర్ నటుడు హర్షవర్ధన్ మంచి జోష్ మీద ఉంటున్నాడు. ఈ నడుమ ఆయన చేస్తున్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మొన్న కోర్టు సినిమాలో లాయర్ పాత్రలో ఆయన నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి.


చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే లేకుండా చేస్తున్న ఆయన.. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నా సింగిల్ గా ఉండటానికి గల కారణాన్ని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో మాట్లాడారు. తనకు కూడా పెళ్లి బంధంపై మంచి అభిమానం ఉందన్నారు. కాకపోతే ఒక అమ్మాయి వల్ల తాను సింగిల్ గా ఉండిపోవాల్సి వచ్చిందన్నారు.

‘నేను కాలేజీలో చదువుకునే టైమ్ లో ఓ అమ్మాయిని ఏడేళ్ల పాటు లవ్ చేశాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుని అనాథాశ్రమం నుంచి నలుగురిని దత్తత తీసుకోవాలని అనుకున్నాం. ఒక అమ్మాయికి ఇంత మంచి మనసు ఉందా అనుకున్నాను. కానీ ఓ రోజు సడెన్ గా వెళ్లిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నాకు చాలా బాధేసింది. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పటి నుంచే పెళ్లి, అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాను. కానీ అది వేస్ట్ అనిపించింది. పిల్లలు ఉంటే అడ్జస్ట్ అయి బతకాలంటే నా వల్ల కాదనిపించింది. అందుకే సింగిల్ గా ఉండిపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.