Sex During Periods: పీరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొనవచ్చా?

www.mannamweb.com


What happens if you do intercourse during periods and will it cause infections: పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా? ఒకవేళ సెక్స్ చేస్తే ఏమవుతుంది?

ఆ సమయంలో సెక్స్ చేస్తే ఆరోగ్యరీత్యా ఆడవారికి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? ఆడవారిలో బ్లీడింగ్ అవుతుండటం వల్ల మగవారికి ఏమైనా ఇన్‌ఫెక్షన్ సోకుతుందా? ఇలాంటి సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ విషయంలో చాలామందికి చాలా రకాలు అపోహలు కూడా ఉంటాయి. ఇదే విషయమై ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ రెడ్డితో హెచ్ఎంటీవీ మాట్లాడగా ఆయన ఈ సందేహాలకు సమాధానం ఇస్తూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

పీరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొంటే ఇన్‌ఫెక్షన్ వస్తుందా?

పీరియడ్స్ సమయంలో ఆడవారికి అసౌకర్యం లేనంతవరకు సెక్స్‌లో పాల్గొనడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవీ లేవని డా ఆశిష్ రెడ్డి అన్నారు. పీరియడ్స్ మొదటి రోజు లేదా రెండో రోజు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే సందర్భాల్లో ఆడవారు అంతగా కంఫర్ట్‌గా ఉండరు అని చెప్పారు. అయినప్పటికీ ఒకవేళ సెక్స్‌లో పాల్గొనాలి అని అనుకున్నట్లయితే… అలాంటి సందర్భంలో కాండోమ్ ధరించడం ఉత్తమం అని సూచించారు.

ఎందుకంటే, ఎక్కువ బ్లీడింగ్ అవుతుండటం వల్ల కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసుల్లో ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాండోమ్ ధరించి సెక్సులో పాల్గొనడం వల్ల ఆ ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని డా ఆశిష్ తెలిపారు. అంతకు మించి ఆ రక్తం వల్ల పురుషాంగానికి వచ్చే ఇబ్బంది లేదన్నారు.

పీరియడ్స్ సమయంలోనే ఆడవారిలో ఎక్కువ సెక్స్ కోరికలు

పీరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొనవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ డాక్టర్ ఆశిష్ మరో ఆసక్తికరమైన విషయాన్ని ఆడియెన్స్‌తో పంచుకున్నారు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో ఆడవారిలో ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. అందుకే ఆ సమయంలో వారికి సెక్స్ కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు.

చాలా దేశాల్లో పీరియడ్స్ సమయంలోనే సెక్స్‌లో పాల్గొనేందుకు లేడీస్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారని డాక్టర్ ఆశిష్ రెడ్డి చెప్పారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదని, ఇది చాలా సర్వసాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొనడం వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు రావని వివరించారు.

న్యాచురల్ లూబ్రికేషన్, ఎక్కువ తృప్తి

బ్లడ్ అనేది న్యాచురల్ లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో శృంగారం నొప్పిగా అనిపించే అవకాశాలు కూడా తక్కువే అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. పైగా ఆ సమయంలో కండరాలు సున్నితంగా మారడంతో పాటు రక్తస్రావం కలుగుతుండటం వల్ల శృంగారంలో భావప్రాప్తి కూడా ఎక్కువే ఉంటుందని హెల్త్‌లైన్.కామ్ వెల్లడించింది.

నెలసరి నొప్పి నుండి శృంగారంతో ఊరట

నెలసరి సమయంలో కొంతమందికి పొత్తికడుపులో భరించలేని నొప్పి కలుగుతుంది. ఆ సమయంలో కండరాల నిర్మాణంలో కలిగే మార్పుల వల్లే ఆ నొప్పి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. అయితే, నెలసరి సమయంలో సెక్సులో పాల్గొనడం వల్ల కలిగే భావప్రాప్తి ఆ నొప్పి నుండి ఊరట కలిగిస్తుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సెక్సులో పాల్గొన్నప్పుడు ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ విడుదల అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ శరీరానికి హాయినిస్తాయి. దానివల్ల మనసు నుంచి నొప్పి ఫీలింగ్ పోతుందని కూడా చెబుతారు.