అమెరికా నుంచి వచ్చాక ఈ బాగోతం బయటపడింది: శాంతి భర్త మదన్‌మోహన్‌

www.mannamweb.com


అమెరికా నుంచి వచ్చాక ఈ బాగోతం బయటపడింది: శాంతి భర్త మదన్‌మోహన్‌

విజయవాడ: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతితో తనకు చట్టబద్ధంగా విడాకులు కాలేదని ఆమె భర్త మదన్‌మోహన్‌ తెలిపారు. గత రెండేళ్లుగా అమెరికాలో ఉన్నానని.. జనవరిలో తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చాక బాగోతం బయటపడిందన్నారు. ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మదన్‌మోహన్‌ మాట్లాడారు.

ఆమే విజయసాయిరెడ్డి పేరు చెప్పారు
‘‘బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశమిది. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపారు. నేను షాక్‌ అయ్యాను. ఐవీఎఫ్‌ చేయించుకోవాల్సిన అవసరమేంటని నిలదీశాను. ఈ క్రమంలో పలుమార్లు మా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఓసారి ఆమే స్వయంగా విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. ఆయనే తనకు డోనర్‌ అని.. ఆయన ద్వారానే ఐవీఎఫ్‌ చేయించుకున్నట్లు చెప్పారు. నాకు ఆమెతో ఇప్పటికే ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని శాంతిని కోరా. విడాకుల కోసం ఆమె చాలా బెదిరించింది. కుమార్తెలు ఉన్నందున సమాధానం చెప్పాలని నిలదీశా’’

ఆ బాబుకు తండ్రి ఎవరో తేలాలి
‘‘విశాఖలోని ఓ ఆస్పత్రికి వెళ్లి అడిగితే వివరాలు ఇచ్చారు. అక్కడి కేస్‌ షీట్‌లో పోతిరెడ్డి సుభాష్‌ పేరు ఉంది. ఆ తర్వాత కొన్ని వివరాలు సేకరిస్తే సుభాష్‌ వైకాపా హయాంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది అని తెలిసింది. సుభాష్‌తో మాట్లాడితే బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంతి మాత్రం తన భర్త సుభాషే అని ఫొటోలు చూపిస్తున్నారు. ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్‌లో అది మహావృక్షమై కూర్చొంటుంది. అందుకే దీన్ని పరిష్కరించాలి. నాతో పాటు విజయసాయిరెడ్డి, సుభాష్‌లకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించాలి. ఏడాది బాబుకు న్యాయం జరగాలి. ఆ చిన్నారికి తండ్రి ఎవరో తెలియాలి. భవిష్యత్‌లో స్కూల్‌లో చేర్పిస్తే తండ్రి స్థానంలో ఎవరి పేరు రాయాలి?ఇంతవరకు శాంతి కూడా ఆ బాబు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదు’’

అది ఫేక్‌ డాక్యుమెంట్‌
‘‘2016లో నేను విడాకుల డాక్యుమెంట్‌పై సంతకం చేసినట్లు ఆమె ఆరోపిస్తోంది. అది ఫేక్‌ డాక్యుమెంట్‌. కావాలంటే దాన్ని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించవచ్చు. డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి తండ్రి ఎవరో తేల్చాక రాతపూర్వకంగా ఓ డాక్యుమెంట్‌ ఇవ్వడమే దీనికి శాశ్వత పరిష్కారం. అలా చేస్తే నాకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయంపై ఏపీ హోంమంత్రి, డీజీపీని కలిశాను. నిజానిజాలను తేలుస్తామన్నారు’’ అని మదన్‌మోహన్‌ తెలిపారు.