50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా పద్మ భూషణ్ ప్రకటించింది మాజీ హీరోయిన్ శోభనకు. 50 ఏళ్ళు దాటినా ఈ నటి బ్యాచిలర్ గానే ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకోకపోడానికి కారణం ఏంటో ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతకీ ఎంటా కారణం.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పూరస్కారాల్లో మాజీ హీరోయిన్.. క్లాసికల్ డాన్సర్ శోభన కూడా ఉన్నారు. హీరోయిన్ గా దాదాపు 200 సినిమాల్లో నటించిన ఆమె.. క్లాసికల్ డాన్సర్ గా దేవ విదేశాల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. కళామతల్లికి ఆమె చేసిన సేవకు గానే 2025 కు పద్మభూషన్ అవార్డ్ ఆమెను వరించింది. అయితే 2006 లోనే శోభనకు పద్మశ్రీ వచ్చింది.

ఇది ఇలా ఉంటే శోభన హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. సౌత్ లో 90స్ బ్యాచ్ లో ఆమె నటించని స్టార్ హీరో అంటూలేడు. తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఆమె ఆల్మొస్ట్ అందరు హీరోలతో నటించి మెప్పించింది.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, తమిళంలో సత్యారాజ్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది శోభన.

బేసిక్ గా మలయాళ ఫ్యామిలీకి చెందిన శోభన.. ఏ భాషలో నటించినా.. తమ సొంతం అనే భావన కలిగిస్తుంది. ఇక 54 ఏళ్ళు వచ్చినా.. ఈ హీరోయిన్ ఇంకా బ్యాచిలర్ గానే ఉంది. పెళ్ళి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

ఈక్రమంలో ఆమె పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నఎదురైనప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు అందరు. ఓంటర్వ్యూలో పెళ్ళి ప్రస్తావన రాగా.. తనకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని అన్నారు ఆమె.

అసలు తనకు పెళ్లిపై నమ్మకం లేకనే వివాహం చేసుకోలేదని.. పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని అన్నారు. బ్యాచిలర్ లైఫ్ తనకు చాలా హ్యాపీగా ఉంది అంటోంది శోభన. ఆమె సినిమాలకు దూరం అయ్యి చాలా కాలం అయ్యింది. రీసెంట్ గానే ప్రభాస్ కల్కి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. అంతే కాదు సినిమాలు వదిలేసినా.. తన డాన్స్ ఫిల్డ్ ను మాత్రం వదల్లేదు శోభన.

ఓ డాన్స్ స్కూల్ ను రన్ చేస్తూ.. తన లాంటి కళాకారుళను తయారు చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె వరుసగా మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య అఖండ 2 తో పాటు.. బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కూడా నటిస్తున్నారని టాక్ వచ్చింది.