OTT లవర్స్‌కు షాక్‌.. ఇకపై 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్‌

www.mannamweb.com


ఒకప్పుడు సినిమా అనగానే.. థియేటర్‌ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మూవీలు చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చునే రీసెంట్‌ కాలంలో వచ్చిన సినిమాలను చక్కగా ఎంజాయ్‌ చేయవచ్చు. కరోనా తర్వాత నుంచి ఓటీటీలకు క్రేజ్‌ పెరిగింది. కోవిడ్‌ కాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో అందరు ఇళ్లకే పరిమితయ్యారు. ఆ సమయంలో బయటకు వెళ్లడానికి లేదు. ఇంట్లోనే కూర్చేవాలి. ఆ సమయంలో అందరికి బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది ఓటీటీ. మాతృభాషతో సంబంధం లేకుండా.. ఓటీటీల్లో ఉన్న సినిమాలను వరుస పెట్టి చూడటం మొదలు పెట్టారు. వీటికి క్రేజ్‌ ఎంతలా పెరిగింది అంటే.. ఆ తర్వాత కూడా థియేటర్‌కు వెళ్లే బదులు ఓటీటీలకే ఓటు వేశారు ప్రేక్షకులు. వాటికి క్రేజ్‌ పెరగడంతో.. ఆ ప్లాట్‌ఫామ్‌లు భారీగా ఖర్చు చేసి కొత్త సినిమాలను ప్రేక్షకుల కోసం తీసుకువచ్చాయి. ఇక కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏ సినిమా అయినా సరే 4 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా నిర్మాతల మండలి ఓటీటీ విడుదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

ఓటీటీలో సినిమాల విడుదలకు సంబంధించి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 8 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి రావాలని నిర్ణయించింది. తాజాగా తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే స్టార్‌ హీరోలు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వాలని నిర్ణయించింది. అలానే ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్‌ మొదలుపెట్టకూడదని తెలిపింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకునే సినిమాలన్ని.. అక్టోబర్‌ 31 లోగా వాటి చిత్రీకరణ పూర్తి చేయాలని సూచించింది. అలానే నవంబర్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్‌ చేపట్టకూడదని వెల్లడించింది.

అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం.. ప్రస్తుతం కోలీవుడ్‌లో నడుస్తోన్న తమిళ హీరోలు వర్సెస్ తమిళ నిర్మాతల మండలి వార్‌. ప్రస్తుతం ఇది పీక్స్‌కు చేరుకుంది. స్టార్‌ హీరోలతో వరుసగా వివాదాల నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు పూర్తి చేయకుండా ధనుష్‌కు చెక్‌పెట్టింది తమిళ నిర్మాతల మండలి. హీరో ధనుష్‌తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి చేస్తూనే ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని నిర్ణయించింది. ధనుష్‌పై వేటు వేసిన నేపథ్యంలో అదే దారిలో ఉన్న శంభు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాల్‌ పైనా త్వరలో చర్యలు తీసుకునే అవకాశంపై కోలీవుడ్‌లో తీవ్ర చర్చ జరుగుతుంది.