హీరో శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని కొందరు, కామెడీ కేక అని ఇంకొందరు, ‘శ్వాగ్’ ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. వాటిపై లుక్ వేయండి
ప్రీమియర్స్‌కు ఈ రేంజ్ పాజిటివ్ రివ్యూస్ ఈ మధ్య కాలంలో మరొక సినిమాకు చూసి ఉండరు… ‘ఓం భీమ్ బుష్’ తర్వాత యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన సినిమా ‘శ్వాగ్’ (Swag Movie). తనకు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఇచ్చిన హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు చేసిన తాజా చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 4న సినిమా రిలీజ్. అయితే, ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి.
శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు!
‘శ్వాగ్’లో శ్రీవిష్ణు నాలుగు రోల్స్ చేశారు. అందులో సింగ క్యారెక్టర్ హిలేరియస్ ఉందని టాక్. మిగతా మూడు క్యారెక్టర్లలోనూ అద్భుతంగా నటించారట. శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ‘శ్వాగ్’ అని చెబుతున్నారు ప్రీమియర్ షో చూసిన జనాలు.
అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్!
‘శ్వాగ్’ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. శ్రీ విష్ణు, గెటప్ శ్రీను మధ్య హిలేరియస్ కామెడీ ట్రాక్ తో మొదలైన సినిమా… ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని సదరు నెటిజన్ పేర్కొన్నాడు. సెకండాఫ్ కామెడీ కంటే శ్రీవిష్ణు పెర్ఫార్మన్స్ మీద ఎక్కువ నడిచిందట. ఆయన వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు.
తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు!
ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘శ్వాగ్’ లాంటి సినిమా రాలేదని, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా అని జనాలు పొగుడుతున్నారు. దర్శకుడు హసిత్ గోలి మంచి సందేశం ఇచ్చారని చెబుతున్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా హసిత్ గోలి స్క్రీన్ ప్లే గురించి పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. అసలు ఆ విధమైన బోల్డ్ నెరేటివ్ ఇంతకు ముందు చూసి ఉండరట.
మీరా జాస్మిన్, రీతూ వర్మ… 3 స్టార్ రేటింగ్స్!
ప్రీమియర్ షోస్ చూసిన మెజారిటీ నెటిజన్స్ ‘శ్వాగ్’ సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మీరా జాస్మిన్ చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ చేశారట. తెలుగు ప్రేక్షకులకు శ్రీ విష్ణు, హసిత్ గోలి న్యూ ఏజ్ సినిమా ఇచ్చారని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చాలా మంది చెబుతున్నారు. మరి, ఈ సినిమా గురించి ట్విట్టర్ జనాలు ఏమని అంటున్నారో చూడండి