వైజాగ్ లోని ఈ ప్రాంతం త్వరలోనే మరో సిలికాన్ వ్యాలీ అయ్యే అవకాశం ఎక్కడో తెలిస్తే ఆనందిస్తారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి విశాఖపట్నం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ విదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.


దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు. విశాఖపట్నం మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చక్కటి డెస్టినేషన్ గా ఉంది. విశాలమైనటువంటి సముద్రతీరము లాజిస్టిక్స్ హబ్ గా తూర్పు తీరంలో చెన్నై తర్వాత అతిపెద్ద పట్టణంగా విశాఖపట్నం పేరు సంపాదించుకుంది. ఈస్టర్ కమాండ్ తో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికే మణిహారం అని చెప్పవచ్చు. విశాఖపట్నంలో మొదటి నుంచి కూడా కాస్మోపొలిటిన్ కల్చర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద నగరంగా విశాఖపట్నం లభించింది. భౌగోళికంగా విశాఖపట్నం కి అనేక అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ చక్కటి ప్రకృతి ఆవాసంగా ఉంది. చుట్టూ పచ్చటి కొండలు, విశాలమైన సముద్రపు తీరం, ఈ ప్రాంతాన్ని ఆకర్షించే ప్రధానమైన వనరులుగా చెప్పవచ్చు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఐటీ రంగం ఎక్కువగా మధురవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరిస్తోంది అని చెప్పవచ్చు.

మధురవాడ ప్రాంతం ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగానికి సైతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఐటీ రంగానికి చెందినటువంటి ప్రధాన కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటివి పెద్ద ఎత్తున తమ కార్యాలయాలను క్యాంపస్లను ప్రారంభించాయి. ఈ ప్రాంతం అభివృద్ధిలో ఐటీ రంగం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ వాలీ సైతం ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత కీలకమైన భాగస్వామ్యం పోందే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు విశాఖపట్నంలో అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్న అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం సైతం మధురవాడకు సమీపంలోనే ఉంది.

ఈ నేపథ్యంలో మధురవాడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరంగా కూడా చక్కటి అవకాశాలను కలిగి ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ ప్రాంతం చక్కటి ఆప్షన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు  పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని  పాఠకులకు సూచిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.