మహిళలకు షాక్.. గోల్ట్ దారిలోనే సిల్వర్ కూడా.. రూ. లక్ష దాటేసిందిగా

www.mannamweb.com


ఆడవాళ్లు అలంకార ప్రియులు. అందంగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా శారీస్, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా జ్యువెలరీ లేనిదే ఏ ఫంక్షన్‌కు వెళ్లరు.  ఒంటి నిండా దగదగలాడే నగలతో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కావాలని అనుకుంటారు. అలాగే బంగారాన్ని స్టేటస్ సింబల్ అని భావిస్తుంటారు. అందుకే భర్తలతో పోరు పెట్టి మరీ కొనుగోలు చేసేలా పంతం పడుతుంటారు. భర్తలు కూడా ఆర్థికంగా అక్కరకు వస్తాయని, భార్య ముచ్చట తీరుతుందని భావించడంతో వీటిని పర్చేస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గోల్ట్ ధరలు కొండ నెక్కి కూర్చుంటున్నాయి. దీంతో సామాన్యులు సిల్వర్ జ్యువెలరీతో సరిపెట్టుకుంటున్నారు.

బంగారం నగలకు ధీటుగా.. మంచి మంచి డిజైన్లలో తక్కువ ధరకే ఆభరణాలు లభిస్తుండటంతో వెండి నగల వైపు మక్కువ పెంచుకుంటున్నారు మగువలు. కానీ ఇప్పుడు సిల్వర్ ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. మధ్య తరగతి కుటుంబీలను భయపెడుతోంది. సుమారు ఏడాది నుండి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 7,500 మార్క్‌ను దాటింది. అలాగే 22 క్యారెట్స్ బంగారం గ్రాము ధర సుమారు 7వేలకు చేరువౌతుంది. దీంతో సామాన్యలు ఛాయిస్ సిల్వర్ అయ్యింది. కాస్త మెయిన్ నెస్స్ సరిగ్గా చేస్తే.. తళతళ మెరుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. ఏడాది గ్యాప్‌లో సిల్వర్ రేటు డబుల్ అయ్యింది. ఇప్పుడు కిలో వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటిసింది. ఏడాది క్రితం కిలో సిల్వర్ ధర రూ. 50వేలు పలుకుతుండేది. కానీ ఇప్పుడు రెండింతలై కూర్చుంది.

జులై 17న వెండి ధర పెరిగింది. గ్రాముకే రూపాయే పెరిగినప్పటికీ.. కిలోపై రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ.1, 00, 500గా ఉంది. ఇటీవల బంగారం ధరలు హెచ్చు తగ్గుల నమోదు చేస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో గోల్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయి సామాన్యులకు ముఖ్యంగా మహిళలను బెంబేలెత్తిస్తుంది. ఆర్నమెంట్ గోల్ట్ 22 క్యారెట్ గతంలో రూ. 5800 ఉండగా.. ఇప్పుడు.. రూ. 6900లకు దగ్గరైంది. ఈ రోజు బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ. 980 పెరగ్గా.. 22 క్యారెట్ గోల్ట్ రూ. 900లు పెరిగింది. దీంతో ప్యూర్ గోల్ట్ రూ. 75000 వేలు పలుకుతుండగా.. ఆభరణాల బంగారమైన 91.6 గోల్ట్ (22 క్యారెట్స్) 10 గ్రాముల ధర రూ.68, 750గా చూపిస్తుంది. ధరలు పెరుగుదలతో బంగారం దుకాణాల వైపు చూడలేని పరిస్థితి. ఆషాడ మాసంలోనే ఇలా ఉంటే.. శ్రావణ మాసంలో ధరలు మరింత పెరగవచ్చునని తెలుస్తుంది.