Sleep As Per Age: ఈ కాలంలో నిద్రలేమి సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. దీనికి స్ట్రెస్ కారణం కావచ్చు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు. అయితే, నిద్రలేమితో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల కలుగుతాయి.
అయితే, మీ వయస్సు రీత్యా ప్రతిరోజూ ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం.
నవజాత శిశువు..
అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడు నెలల పిల్లల వరకు నిద్ర అందరి కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. నవజాత శిశువుకు రోజుకు దాదాపు 14- 17 గంటల నిద్ర అవసరం.
చిన్నపిల్లలు..
నాలుగు నెలల నుంచి 11 నెలల వరకు చిన్నపిల్లలకు రోజుకు 12-15 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
ఏడాది నుంచి రెండేళ్లు ఉన్న పిల్లలకు ప్రతిరోజూ 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం ఉంటుంది. ఇది మంచి మెదడు పనితీరుకు ఎంతో అవసరం.
ప్రీ స్కూలర్స్..
మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లలు ప్రతిరోజూ నిద్ర 10 గంటల నుంచి 13 గంటలు అవసరం ఉంటుంది. వీళ్లు ప్రీ స్కూల్ కు చెందినవారు. స్కూళ్లకు వెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల వయస్సు ఉండే పిల్లలకు సరైన నిద్ర అవసరం. ఇది వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. ప్రతిరోజూ 9-12 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
టీనేజీ..
13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజీ పిల్లలు స్పోర్ట్స్, చదువులతో ఎక్కువగా అలసిపోతారు. ఈ సమయంలో వారి అవయవాలు కూడా పెరుగుతుంటాయి. టీనేజీ ఉన్నవారికి ప్రతి రోజూ 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
పెద్దలు..
ఇక 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉద్యోగాలు, ఫ్యామిలీ వర్క్‌తో బిజీగా ఉంటారు. వీళ్లు ఎక్కువ స్ట్రెస్‌కు కూడా గురవుతారు. ఈ వయస్సు వారికి ఎక్కువ రెస్ట్ కూడా అవసరం. ఈ వయస్సుకు చెందినవారు ప్రతిరోజూ 7-9 గంటల నిద్ర అవసరం.
61 ఏళ్లు ఆపైన ఉన్నవారికి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఈ వయస్సువారిలో నిద్రలేమి కూడా వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం వారి ఆరోగ్య సమస్యలు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Mannam Web దీనిని ధృవీకరించడం లేదు. )