సూపర్ ఫీచర్లతో కేవలం రూ.6,499 లకే స్మార్ట్ ఫోన్..

POCO C71 ఫోన్ ఫీచర్స్… డిస్ ప్లే.. 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్‌ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది.


కెమెరా.. 32MP బ్యాక్ కెమెరా , సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, అలాగే 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. స్టోరేజ్..

4GB ర్యామ్ + 64GB రోమ్, 6GB ర్యామ్ + 128GB రోమ్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా 6GB వరకు ర్యామ్‌తో పాటు 6GB వరకు వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ప్రాసెసర్.. ఇక ఈ ఫోన్ Android 15 తో విడుదల అవుతోంది. Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 1.8 GHz Octa-Core Unisoc T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPUను కలిగి ఉంది. POCO కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది.

బ్యాటరీ.. 5200mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ధర.. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా కంపెనీ నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, ఎయిర్టెల్ వినియోగదారుల కోసం POCO C71 కేవలం రూ. 5,999కి ప్రత్యేక ఆఫర్ కింద పొందవచ్చు. మరోవైపు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ లో USB Type-C పోర్ట్, IP52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 3.5mm ఆడియో జాక్ కలిగి ఉన్నాయి.