స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తెకు ఎన్టీకేలో కీలక పదవి

గంధపు చెట్ల స్మగ్లర్‌ దివంగత వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి వీరప్పన్‌కు తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే) పార్టీలో కీలక పదవి వరించింది. ఆ పార్టీ యూత్‌ బ్రిగేడ్‌ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా ఆమెను నియమిస్తున్నట్టు పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్‌ ప్రకటించారు. మొదట్లో పీఎంకేలో ఉన్న ఆమె 2020లో భాజపాలో చేరి ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తర్వాత ఆ పార్టీ నుంచి వైదొలగి 2024లో ఎన్టీకేలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి ఎన్టీకే అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరప్పన్‌ 2004లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు.