ఫేస్ మాస్క్ కింద కూడ నిమ్మ తొక్కల పొడిని ఉపయోగించుకోవచ్చు. చర్మాన్ని క్లీన్ చేయడానికి నిమ్మ తొక్కల పొడి ఉపయోగపడుతుంది. స్క్రబ్ లాగా ఉపయోగించొచ్చు. నిమ్మ తొక్కలను జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. వీటిని పేస్ట్ లాగా తయారు చేసి వాడుకోవచ్చు. నిమ్మ తొక్కలను నూనెలో వేడి చేసిన తర్వాత చల్లార్చాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
నిమ్మకాయతోనే కాదు వాటి తొక్కల వల్ల కూడా ఉపయోగాలుంటాయి. ఒక రకంగానే కాదు అనేక రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. నిమ్మ తొక్కలోనూ విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. నిమ్మ తొక్కల్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. నిమ్మ తొక్కల్ని తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. విష పదార్థాలు బయటకు పోతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడడానికి నిమ్మ తొక్కలు సహాయపడతాయి. నిమ్మ తొక్కల్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి నిమ్మ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. చెడు కొవ్వుతో బాధపడేవారు ఈ నిమ్మ తొక్కలు తీసుకోవడం మంచిది.. గుండె సమస్యల నుంచి బయటపడడానికి నిమ్మ తొక్కలు బాగా పని చేస్తాయి. నిమ్మ తొక్కల్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మతొక్కలు ఉపయోగపడతాయి. విటమిన్ డి లోపం వల్ల దంతాల సమస్యలు వస్తాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మతొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి.
నిమ్మ తొక్కలోని పోషకాలు బాడీలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. రక్తపోటు రాకుండా కాపాడుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. బరువు అదుపులో ఉంచడానికి నిమ్మ తొక్కలు దోహదపడతాయి.నిమ్మ తొక్కలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది. అలాగే చర్మ సమస్యల నుంచి బయట పడేస్తాయి. ఫేస్ మాస్క్ కింద కూడ నిమ్మ తొక్కల పొడిని ఉపయోగించుకోవచ్చు. చర్మాన్ని క్లీన్ చేయడానికి నిమ్మ తొక్కల పొడి ఉపయోగపడుతుంది. స్క్రబ్ లాగా ఉపయోగించొచ్చు. నిమ్మ తొక్కలను జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. వీటిని పేస్ట్ లాగా తయారు చేసి వాడుకోవచ్చు. నిమ్మ తొక్కలను నూనెలో వేడి చేసిన తర్వాత చల్లార్చాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
































