Indian Currency Notes గురించి కొన్ని విశేషాలు… భారత్ లో అత్యంత పెద్ద నోటు ఏది?

www.mannamweb.com


మన దైనందిన జీవితంలో డబ్బుకు ఎంతో విలువ ఇస్తాం. డబ్బును కరెన్సీ నోట్ల రూపంలో వాడుతాం. ఎందుకంటే నిర్దిష్ట నోటుపై వాగ్దానం చేసిన సంతకం వల్ల దానికి ఆ విలువ వస్తుంది. అయితే మన కరెన్సీ నోట్ల గురించి ఎంత మందికి తెలుసు? అతి చిన్న విలువైన రూపాయి నోటు దగ్గర నుంచి 2 వేల నోటు వరకు మనదేశంలో చాలా నోట్లు చలామణిలో ఉన్నాయి. ఒక్క రూపాయి నోటు మినహా మిగతా అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటు మీద మాత్రం భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఆర్బీఐని 1935లో స్థాపించారు. 1949లో దీన్ని జాతీయం చేశారు. 1949కి ముందు అన్ని కరెన్సీ నోట్లను ఆర్పీఐ బదులు భారత ఆర్థిక కార్యదర్శి తరఫున జారీ చేసేవారు.

ఆ తర్వాతి కాలంలో ఆ బాధ్యతను అపెక్స్ బ్యాంకుకి అప్పగించారు. అప్పటి నుంచి అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం చేస్తుండగా.. రూపాయి నోటుపై మాత్రం ఆర్థిక కార్యదర్శి సంతకాన్ని కొనసాగించారు. 1994 తర్వాత రూపాయి నోటు చెలామణిలో లేకుండా పోయింది. దీన్ని టోకెన్ కరెన్సీ నోటుగా పరిగణించారు.

ఆర్బీఐ ముద్రించిన అత్యధిక విలువ కలిగిన నోటు రూ.10,000. దీన్ని1938లో ప్రవేశపెట్టారు. 1946లో దీన్ని రద్దుచేశారు. అయితే 1954 ఈ నోటును మళ్లీ ప్రవేశపెట్టారు. తిరిగి 1978లో రద్దు చేశారు. భారత కరెన్సీ నోట్ల గురించి ఆసక్తికర విషయమేమంటే ప్రస్తుతం వాడుతున్న నోట్ల తయారీలో 100 శాతం పత్తినే వినియోగిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసిన ప్రతి నోటుపై ఒక స్టేట్‌మెంట్ ముద్రించి ఉంటుంది. నోటుపై పేర్కొన్న విలువను బేరర్‌కు చెల్లిస్తామని ఇది హామీ ఇస్తుంది.

ఆర్బీఐ గవర్నర్ చేసే ఈ ప్రకటన, ఒక రకమైన ప్రామీసరి నోటు వంటిది. ఇది ఎవరి దగ్గరయితే ఉంటుందో, వారే లీగల్ టెండర్ అవుతారు. దీన్ని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రామీసరి నోటు అనేది ఒక రకంగా ఆర్బీఐ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం. దీని ప్రకారం ఆ నోటుపై ఉన్న విలువ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. ఏ కరెన్సీ నోటుపై ప్రామీసరి నోటు లేకపోయినట్లయితే ఏ విదేశం లేదా సంస్థ దాన్ని అంగీకరించదు.