త్వరలోనే వృద్ధులకు రూ. 4వేలు, మహిళలకు రూ. 2500; శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అయితే ఇప్పటికే అనేక పథకాలను అమలులో తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మరో రెండు హామీలను నెరవేర్చడానికి సమాయత్తమవుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.


వృద్ధులకు, మహిళలకు శుభవార్త చెప్పిన జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛన్, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం పథకాలు అమలు చేసేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందని ఆయన సంతోషకరమైన విషయాన్ని తెలిపారు. ఈ హామీలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఈ పథకాలు అమలులోకి వస్తాయని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి ఆ పనిలో ఉన్నాడు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ హామీల అమలు గురించి ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నింటిని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ ను సమకూర్చుకునే పనిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని, ప్రజలు మరికొంత ఓపికతో నిరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది

రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసని, కనుక కాస్త సంయమనంతో ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైన మాట్లాడిన ఆయన జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.

నవీన్ యాదవ్ గెలిస్తే జరిగేదిదే

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ముఖ్యమంత్రి ద్వారా భారీగా నిధులు తెచ్చి అవసరమైన పనులు చేయడానికి ఉంటుందని పేర్కొన్నారు ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ప్రతిపక్ష నేత గెలిస్తే అభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ ని గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తన తీసుకుంటానన్నారు.

మాట నిలబెట్టుకుంటాం

రాబోయే ఐదేళ్లు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇస్తారన్న విశ్వాసం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటా మని, ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, మిగిలిన హామీలను కూడా కచ్చితంగా నెరవేరుస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.