త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

తాజా నివేదిక ప్రకారం.. సునితా విలియమ్స్ కు ఎముక సాంద్రత తీవ్రంగా తగ్గింది. అలాగే, కంటి సమస్యలు, ఇమ్యూనిటీ బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉంటే శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. దీన్ని బట్టి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నిపుణులు వివిధ రకాలుగా చెబుతున్నారు. సునీతా విలియమ్స్‌ కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరం చాలా కాలం పాటు మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు మసిల్‌ ఎట్రోపీకి ఇది దారి తీస్తుంది. కాళ్లు, తొడల వెనుక భాగంతో పాటు మరికొన్ని భాగాల్లో ఈ సమస్యలు ఎదురవుతాయి. ఇన్ని నెలల పాటు అక్కడ ఉన్నవారిలో ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో ఫ్రాక్చర్ల ముప్పు అధికమవుతుంది. వ్యోమగాములు స్పేస్‌లో నెలకు 1 నుంచి 2 శాతం ఎముకల సాంద్రతను కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. న్యూరోవెస్టిబ్యులర్ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక రేడియేషన్‌ ఉన్న వాతావరణంలో ఉండటంతో క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటున్నారు నిపుణులు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.