ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ముందుకు దూసుకొని వెళుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధాప్య పింఛన్లను 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచింది. ఆ తర్వాత ఏపీ రైతు భరోసా, ఏపీ తల్లికి వందనం పేరిట అటు రైతులకు మహిళలకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను మహిళలకు అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీ ప్రభుత్వం మహిళల కోసం వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్థిక స్వావలంబన కింద నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం విషయంలో కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మహిళలకు 1500 రూపాయలు స్కీం ప్రధాన ఉద్దేశ్యం మహిళల ఆర్థిక భద్రత పెంచడం, గృహ స్థాయిలో ఖర్చులకు తోడ్పాటు అందించడం, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం, స్వయంఉపాధి, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం కల్పించేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
అయితే మహిళలకు ఆర్థిక స్వావలం మన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని మహిళల సంఖ్య ఎంత ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే దీనికి ఎంత ఖర్చవుతుంది రాష్ట్ర ఖజానాలో ఆదాయం ఈ సంక్షేమ పథకానికి సరిపోతుందా లేదా అనేదా అంశం పైన తర్జనభర్జనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ స్కీము అమలు చేసే ముందు ముఖ్యంగా మహిళలు కొన్ని విషయాల పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా తయారు చేస్తుంది. ఈ అర్హుల జాబితాలో ఉండే వారికి కొన్ని ప్రాథమిక నిర్ధారణ జరుపుతారు. ఇందులో ప్రధానంగా ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ చేయాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేసుకోవాలి (ఆధార్, ఓటర్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలు), మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.
పైన పేర్కొన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక లబ్ధిదారులు ముందుగా ఈ పనులను చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఇప్పటికే మహిళలకు 1500 రూపాయలు అందించే పథకం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఎలా చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది.
































