సోయా పాలు పూర్తిగా మొక్కల నుంచి లభించే ప్రోటీన్. శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఈ పాలలో ఉంటాయి. సోయా పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. సోయా పాలలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సోయా పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అండాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అలెర్జీ, ఇతర చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇందులో ఈస్ట్రోజెన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలో హార్మోన్లను పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి అతిగా ఈ పాలను తాగొద్దు.
మోనోపాజ్ సమయంలో చాలా మంది మహిళలు బోలు ఎముక వ్యాధికి గురవుతారు. సోయా పాలు తాగడం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. సోయా పాలలో కొవ్వులు తక్కువ. ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సోయా పాలు మంచి ఆహారం. జుట్టు పెరుగుదలకు సోయా పాలు చాలా ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదులకు అవసరమయ్యే ప్రోటీన్లను సోయా పాలు కలిగి ఉంటాయి.
సోయా పాలలోని కొన్ని సమ్మేళనాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాల్షియం శాతం ఎక్కువగా ఉండే సోయా పాలను క్రమం తప్పకుండా తాగితే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సోయాబీన్ పాలు ప్రతి రోజూ తాగితే శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇందులో ఫైబర్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సోయా పాలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా సోయా మిల్క్ తాగడం వల్ల బరువు నిర్వహణ, మధుమేహం, చర్మానికి కూడా మేలు జరుగుతుంది.
ఇందులో విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీర బలహీనత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరం శక్తవంతంగా తయారవుతుంది. బరువు తగ్గాలనుకుంటే సోయాబీన్ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.