ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

www.mannamweb.com


ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అంశం ప్రధాని నిర్ణయాన్ని, తాను ఎలాంటి హామీలు ఇవ్వలేనని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్ర పెద్దలు చెప్పారని శ్రీనివాసవర్మ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఫైనాన్స్ మిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. అందువల్లే హోదా స్థానంలో ప్యాకేజీ ప్రకటించారని చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

కాగా ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదన చేసింది. ఇందుకు బీజీపీ పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఆ తర్వా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడంతో ప్రత్యేక హోదాకు బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుండి. కొన్ని నిధులను రాష్ట్రానికి వినియోగించుకుంది. అయితే నాటి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాల్సందేనని రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ జగన్ , కేంద్రంలో మోడీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ వినిపించలేదు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.