గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లి(Cherlapalli, Kakinada Town, Lingampalli)కి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ – చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల(Guntur, Sattenapalli, Piduguralla) మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది. (07448) చర్లపల్లి – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది.


(07445) కాకినాడ టౌన్‌ – లింగంపల్లి ప్రత్యేక రైలు జూలై 2 నుంచి మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.50కి లింగంపల్లి చేరుకొంటుంది. (07446) లింగంపల్లి – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జూలై 3 నుంచి మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30కి బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుందని సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.