ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. ”స్పిరిట్” మూవీ షూటింగ్ షురూ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతుంది. “సలార్” విజయంతో ఫామ్‌లోకి వచ్చిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ హిట్టు అందుకోనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఒక కొత్త అవతారంలో కనిపించనున్నాడు, అలాగే సినీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అధిరిపోయే అప్డేట్ వచ్చింది. మెక్సికోలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోందని సమాచారం. ఎనిమిది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని టీ-సిరీస్ మరియు భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.