Spoiled Egg:కోడిగుడ్డు పాడైపోయిందని ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి?

Spoiled Egg: కోడిగడ్డులో పోషకాలు మెండు. అందువల్ల దీనిని ప్రతిరోజూ ఒకటి తినాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది ఏదో రకంగా కోడిగుడ్డును తీసుకుంటారు.
అయితే కోడిగుడ్లు ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల పాడైపోతాయి. వేసవి కాలంలో తొందరగా కుళ్లిపోతాయి. ఒక్కోసారి గుడ్డు పైకి బాగానేకనిపించిన లోపల మాత్రం పాడైపోతుంది. మరి కోడి గుడ్డు పాడిపోయిందని ఎలా తెలియాలి? దాని కోసం ఏం చేయాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆరోగ్యంగా ఉండేందుకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నవాటిని తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉండమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియానైనా తట్టుకునే శక్తి వస్తుంది. విటమిన్లు ఎక్కువగా ఉన్న కొన్ని పదార్థాలనుకొనుగోలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అన్ని వర్గాల వారికి ఎక్కువ పోషకాలు ఉండి తక్కువ ధరకు లభించే ఆహార పదార్థం కోడిగుడ్డు. కోడిగుడ్డును రకరకాలుగా తింటారు. కొందరు హాఫ్ బాయిల్ వేసుకొని తింటారు. మరికొందరు కర్రీ ద్వారా తీసుకుంటారు. కానీ ఉడికించిన కోడిగుడ్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
గుడ్డు తినడం వల్ల ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశాలు తగ్గుతుంది. గుడ్డులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటీమిన్ ఈ తో పాటు జింక్, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల శారీరక శ్రమ చేసిన వారు తిరిగి శక్తిని పొందుతారు. గర్భిణులకు కాల్షియం అవసరం. దీంతో కోడిగుడ్డును తప్పనిసరిగా తినాలని చెబుతారు. గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ హెచ్ డీఎల్ స్తాయి మెరుగవుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే గుడ్డు తప్పనిసరి అయిన నేపథ్యంలో చాలా మంది ప్రతి రోజూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది తమకు తెలియకుండానే పాడైపోయిన గుడ్డును తింటున్నారు. అయితే కోడిగుడ్డు నాణ్యమైందా? లేదా? తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్ సరిపోతుంది. ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో షాప్ నుంచి తెచ్చిన కోడిగుడ్డును వేయాలి. అది పూర్తిగా మునిగిపోతే అది నాణ్యమైన గుడ్డు అని తెలుసుకోవాలి. లేక అది నీటిలో తేలియాడినట్లయితే అది పాడైపోయిందని గుర్తించాలి. ఇలా సరైన కోడిగుడ్డును తిని ఆరోగ్యంగా ఉండాలి.