Andhra news: శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్.. భారీగా ఐఏఎస్‌ల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
- వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్
- పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్
- నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు
- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
- ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
- ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
- ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
- ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
- ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి
- పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్
- గనులశాఖ డైరెక్టర్, కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్
- ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
- మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం
- ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌ను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.