ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో లైఫ్ బిజీగా మారిపోయింది. దీంతో ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంది.
ఇక వారాలకు వారాలు లీవ్స్ పెట్టడం కూడా కష్టంతో కూడుకున్న విషయం. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని డైలీ శ్రీశైలం టూర్ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 1 రాత్రి, 2 పగళ్లు కొనసాగుతుంది. ప్రతీరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండడం విశేషం. ఇంతకీ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ధర ఎంతలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ ఇలా సాగుతుంది..
* తొలి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. పర్యాటక భవన్ నుంచి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి బషీర్‌బాగ్ వెళ్తుతుంది, బషీర్‌బాగ్‌లో ప్రయాణికులు వచ్చిన తర్వాత 9 గంటలకు శ్రీశైలం జర్నీ మొదలవుతుంది.
* మార్గ మధ్యంలోనే భోజనం ఉంటుంది. అనంతరం శ్రీశైలం చేరుకున్న తర్వాత తొలుత. సాక్షి గణపతి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం కొండపైకి చేరుకుంటారు. తర్వాత హోటల్‌లో చెకిన్ కావాల్సి ఉంటుంది. రాత్రి బస శ్రీశైలంలోనే ఉంటుది.
* రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కాగానే హోటల్‌లో చెక్ అవుట్ అవుతారు. తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది.
* ఇందులో భాగంగా పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం.. తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు..
టికెట్ ధరల విషయానికొస్తే ఏసీ బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ. 2400, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 1920గా నిర్ణయించారు. ఇక నాన్ ఏసీ విషయానికొస్తే పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600గా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్, హోటల్‌లో బస వంటివి ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. అయితే ఫుడ్, దర్శనం టికెట్లతో పాటు ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.