SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉన్నవారికి అలెర్ట్.. మార్చి 31 చివరి తేదీ..!

www.mannamweb.com


బాలిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన( SSY) పథకాన్ని తీసుకొచ్చింది. బేటీ బచావో బేటీ పడావో యోజనలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో బాలికలకు మాత్రమే ఉంటుంది. ఇందులో పాప సంవత్సరం వయస్సు నుంచి డబ్బు పొదుపు చేయవచ్చు. పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవొచ్చు. సుకన్య సమృద్ధు యోజనలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి.

21 సంవత్సరాల తర్వాత డబ్బు వస్తుంది. పాకు 18 ఏళ్లు నిండిన తర్వాతా కొంత డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.50 వేలకు జమ చేయవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. వడ్డీ,మెచ్యూరిటీ రాబడిపై మినహాయింపులతో పాటు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద SSY ఖాతా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఉదాహారణకు మీ పాప వయస్సు సంవత్సరం అనుకుంటే.. మీరు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి పాపకు 16 ఏళ్లు వచ్చ వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. మీరు నెలకు రూ.12,500 పొదుపు చేస్తే 15 సంవత్సరాల్లో రూ. 22,50,000 పెట్టుబడి పెడతారు. 21 సంవత్సరాల తర్వాత వడ్డీ రూ.46,77,578, అస్సలు రూ.22,50,000 కలిపి మొత్తం రూ. 69,27,578 వస్తాయి. ఒక వేళ నెలకు ఐదు వేలు పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ. 27,71,031 వస్తాయి.

సుకన్య సమృద్ధి యోజనలో నెలనెలా పొదుపు చేయవచ్చు.. లేదా ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే సంవత్సరం కనీసం రూ.250 అయితే కచ్చితంగా చెల్లించాలు. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతోంది. ఇక్కడ సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిస్తుంది. మీకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉండి.. ఇంత వరకు కనీసం రూ.250 కూడా జమ చేయకుంటే.. ఇప్పడే జమ చేయండి లేకుంటే మార్చి 31 తర్వాత మీ ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.