ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కెరీర్ కొనసాగించాలనుకునే వారి కోసం భారీ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఖాళీలు..
SSC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,565 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి.
పోస్టుల వివరాలు..
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు – 4,408 పోస్టులు
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు – 2,496 పోస్టులు
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (ఇతరులు)] – 285 పోస్టులు
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (కమాండో)] – 376 పోస్టులు
విద్యార్హతలు..
- అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉండాలి. ఇంటర్ పాస్ అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
- ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు, కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ వంటి ప్రత్యేక విభాగాలకు అర్హతలో కొన్ని సడలింపులు ఉంటాయి.
- పురుష అభ్యర్థులు తప్పనిసరిగా PE&MT తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే LMV (లైట్ మోటార్ వెహికల్ – బైక్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి..
- 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంది.
- OBC అభ్యర్థులకు – 3 ఏళ్లు
- SC/ST అభ్యర్థులకు – 5 ఏళ్లు
జీతం..
- సెలెక్ట్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
- అదనంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగ భద్రతతో పాటు పెన్షన్, పదోన్నతి అవకాశాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం..
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) – ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఉంటుంది.
- ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT) – అభ్యర్థుల శారీరక సామర్థ్యం, ఎత్తు, ఛాతీ కొలతలు మొదలైన అంశాలు పరిశీలిస్తారు.
- మెడికల్ ఎగ్జామినేషన్ – అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉన్నారా అని పరీక్షిస్తారు.
ఈ పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణత సాధించిన వారే చివరగా ఎంపికవుతారు.
దరఖాస్తు ఫీజు..
- సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు – రూ.100
- SC, ST, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, దివ్యాంగులు – ఎటువంటి ఫీజు ఉండదు.
దరఖాస్తు గడువు..
- 2025 సెప్టెంబర్ 22 నుంచి 2025 అక్టోబర్ 21 వరకు
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అవసరమైన సర్టిఫికేట్‌లు, ఫోటోలు, సంతకం స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
































