నిలువెత్తు భారత రత్నం. ఆయన తండ్రి, తాత, ముత్తాత గురించి మీకు తెలుసా.

www.mannamweb.com


దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో టాటా గ్రూప్ ఒకటి. ఈ టాటా ఫ్యామిలీలో అత్యంత ప్రతిభావంతులైన రత్నాలలో ఒకరైన రతన్ టాటా 86 సంవత్సరాల వయస్సులో మరణించారు.

రతన్ టాటా వ్యాపార రంగంలో దూరదృష్టితో కూడిన నాయకత్వం, దేశ అభివృద్ధి పట్ల అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. రతన్ టాటా తెలివి తేటలు, సహకారంతో టాటా సంస్థ నుంచి అనేక పరిశ్రమలు దేశ విదేశాల్లో స్థాపించారు. అనేక జీవితాలను ప్రభావితం చేసిన రతన్ టాటా నిష్క్రమించడం ఒక శకానికి ముగింపు పలికింది. అయితే అతని ప్రభావం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అయితే రతన్ టాటా కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతని కుటుంబ సభ్యులు చాలా మంది లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.

జంషెడ్ జీతో ప్రారంభించి… రతన్ టాటా ముత్తాత జంషెట్ టాటా. అతను హీరాబాయిని వివాహం చేసుకున్నారు. అతనికి ఇద్దరు కుమారులు దొరాభ్‌జీ టాటా, రతన్‌జీ టాటా. జంషెడ్ జీ 1868లో భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థ టాటా గ్రూప్ సంస్థను జంషెడ్‌పూర్ నగరంలో స్థాపించారు. జంషెడ్ నవసారిలోని పార్సీ కుటుంబంలో జన్మించారు. ముంబైలో ఎగుమతి వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఆయన కుటుంబంలో మొదటి వ్యాపారవేత్త.

జంషెట్ టాటా కుమారుడు దొరాభ్‌జీ టాటా కూడా వ్యాపారవేత్త. అతను 1904 నుంచి 1928 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. దొరబ్ జీ టాటా మెహర్‌బాయిని వివాహం చేసుకున్నారు. 1896లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు.

తన్ టాటా తాత రతన్ జీ దాదా టాటా.. రతన్ జీ దాదా టాటా జంషెడ్ జీ టాటా రెండవ కుమారుడు. రతన్‌జీ దాదా టాటా 1856లో నవ్‌సారిలో జన్మించారు. అతను 1928 నుంచి 1932 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. సునీ అనే ఫ్రెంచ్ మహిళను పెళ్లాడాడు. పేరు నవజాబాయి. వీరిద్దరూ 1892లో వివాహం చేసుకున్నారు. వీరికి కూడా పిల్లలు కూడా లేరు. అప్పుడు ఈ దంపతులు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. పేరు నావల్ టాటా.

రతన్ టాటా తండ్రి నావల్ టాటా.. నావల్ టాటా రతన్‌జీ దాదా టాటా దత్తపుత్రుడు. నావల్ టాటా సోను అనే అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు రతన్ టాటా, జిమ్మీ. రతన్ టాటా బ్రహ్మచారి అయినట్లే జిమ్మీ కూడా పెళ్లి చేసుకోలేదు. నావల్ టాటా, సోనీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. సిమోన్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నోయెల్ టాటా అనే కుమారుడు జన్మించాడు. అంటే నోయల్ టాటా, రతన్ టాటా సవతి సోదరులు.

నోయెల్ టాటా ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నెవిల్లే, లెహ్, మాయా టాటా. కిర్లోస్కర్ గ్రూప్ సభ్యురాలు మానసి కిర్లోస్కర్‌ను నెవిల్ వివాహం చేసుకున్నారు. అయితే లేహ్ టాటా స్పెయిన్ లో విద్యను అభ్యసించింది. ఇక్కడే మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. ఇప్పుడు రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లెహ్ లున్నారు.