60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో .. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

 బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) తన పెళ్లిళ్లతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


వీరికి జునైద్ ఖాన్, ఐరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది కాలంపాటు బాగానే ఉన్న ఈ జంట పలు కారణాల చేత విడిపోయారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ప్రముఖ నిర్మాత కిరణ్ రావు(Kiran Rao)ను 2005లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి కాపురం కూడా సజావుగా సాగలేదు. కొద్ది రోజులకే మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయినప్పటికీ వీరిద్దరు కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి ఆమిర్ ఖాన్ బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్(Gauri Spratt) అనే మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఆమెతో కలిసి పలు ఈవెంట్స్, పార్టీలకు హాజరవుతున్నారు. దీంతో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ”గౌరీ, నేను మా బంధం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నాము. చాలా నిబద్ధతతో కూడిన బంధంలో ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములం.

ఇక మా పెళ్లి గురించి అంటారా నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నాను. దానిని అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలా? వద్దా అనేది ముందు ముందు నిర్ణయించుకుంటాము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 60 ఏళ్ల వయసులో స్టార్ హీరో మూడో పెళ్ల చేసుకోవడంపై నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు అవసరమా అని దుమ్మెత్తిపోస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.