దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? భక్తులను కట్టేసిన పూజరులు! చివర్లో ట్విస్ట్!

www.mannamweb.com


ఏపీలో ఎన్నో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచల క్షేత్రం ఒకటి. ఇక్కడి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వెలసి..నిత్యం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. బుధవారం అక్కడ వినోదోత్సవం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే సమయంలో అక్కడ ఓ పెద్ద ఇష్యూ జరిగింది. స్వామి వారి ఉంగరం తీశారంటూ భక్తులను ఆలయ పూజరులు ప్రశ్నించారు. దీంతో అక్కడి వచ్చిన భక్తులు అవాక్కయ్యారు. తాము స్వామి వారి దర్శనంకి వస్తే ఈ నిందలు ఏంటి అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే చివర్లో పూజలు, ఆలయ అధికారులు ఇచ్చిన ట్విస్ట్ కు భక్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం…

బుధవారం సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు వచ్చారు. ఇక కొందరు భక్తులు క్యూలైన్లో ఉండగా..వారికి ఓషాకింగ్ ఘటన ఎదురైంది. స్వామి దర్శనానికి వచ్చి.. ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా చోరీ చేసిన ఉంగరాన్ని ఇచ్చేయండి, లేదంటే పోలీసులకు అప్పగిస్తామంటూ పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించారు. దీంతో దేవుడి దర్శనం కోసం వచ్చిన ఈ భక్తులు.. ఆయన మాటలకు అవాక్కయ్యారు. తాము దొంగల్లా కనిపిస్తున్నామా.. స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని చోరీ చేశారంటారేంటి? ప్రశ్నించారు. చోరీ చేశామని నిందవేయడమే కాకుండా తాళ్లతో బంధించి తీసుకొస్తారా? అంటూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానాచార్యులు అదే స్థాయిలో మరింత గట్టిగా భక్తులపై ఫైర్ అయ్యారు.

మీరు దొంగతనం చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, పోలీసులు రాక ముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండంటూ ఆయన గట్టిగా అడిగారు. దీంతో అక్కడన ఉన్న కొందరు భక్తులు అయితే ఏకంగా కన్నీటి పర్యంత అయ్యారు. తాము ఉంగరం దొంగిలించలేదని ఎంత చెబుతున్నా వినకుండా దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక భక్తుల చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. చోరీ చేసిన వాటి మాదిరిగానే ఉన్నాయని స్థానాచార్యులు అనడంతో వారి నోటి మాట రాలేదు.

అయితే చివరకు స్థానాచార్యులు చెప్పిన అసలు నిజం తెలుసుకుని భక్తులు అవాక్యయ్యారు. స్వామి వారికి నిర్వహించే వినోదోత్సవంలోని ఓ ఘట్టమని తెలుసుకుని భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం గురించి తెలియని వాళ్లు దొంగతనం నింద పడటంతో భోరున విలపించగా, ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఇలా వినోదోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.